![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1013 లో.. మీ అన్నయ్య ఎందుకు నిన్ను పిలిచాడని అడిగిన చెప్పలేదు.. ఎందుకు మాకు అబద్ధం చెప్పావ్ .. పాపం వసుధర బాధపడుతుందని కూడా ఆలోచించలేదా అని మహేంద్రతో అనుపమ అంటుంది. వదిలెయ్యండి మేడమ్.. మావయ్యతో నాకు చెప్పకూడదని మాట తీసుకున్నారు. అందుకే మావయ్య చెప్పలేదని వసుధార అంటుంది.
ఆ తర్వాత వసుధారకి మహేంద్ర సారీ చెప్తాడు. నన్ను అర్థం చేసుకున్నావని వసుధారతో అంటాడు. మావయ్య నాకు మూడు నెలలు టైమ్ ఇవ్వండి. నేను రిషి సర్ ని తీసుకొని వస్తానని మహేంద్రకి వసుధార చెప్తుంది. ఆ తర్వాత రిషి ఫోటో దగ్గరికి వెళ్లి మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు శైలేంద్ర కోసం ధరణి బెల్ట్ లు రెడీగా పెడుతుంది. శైలేంద్ర వచ్చి ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ తర్వాత దేవయాని కూడ వస్తుంది. మీరు అలా ఎందుకు చూస్తున్నారో అర్థం అవుతుంది. ఇదిగోండి వెన్నె కూడా తెచ్చానని ధరణి అనగానే.. దేవయాని తనపై కోప్పడి పంపించేస్తుంది. అసలేంటిది ఇలా తయారైందని శైలేంద్ర అంటాడు. దాని గురించి పక్కన పెట్టు కానీ ఆ మను గాడు రిషి అంత తెలివైనవాడని దేవయాని అంటుంది. వాడి మాటల వళ్ళే మీ నాన్న కన్విన్స్ అయి.. ఆ వసుధారకి టైమ్ ఇచ్చాడని దేవాయని అంటుంది. అసలు రిషి ఉన్నాడా అంటు మాట్లాడుకంటూ ఉంటే అప్పుడే ఫణింద్ర వచ్చి .. ఇలా మాట్లాడుకుంటున్నారేంటి మీరు ఈ విషయంలో వసుధారకి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే ఊరుకోనని వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు ఫణీంద్ర.
మరుసటి రోజు ఉదయం మను క్యాబిన్ కి వసుధార వెళ్లి నాకు హెల్ప్ చేసినందుకు థాంక్స్.. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్తుంది. అలా ఏం లేదు.. మీరు కాలేజీ గురించి భయంతో అలా మాట్లాడారని నాకు అర్థమైందని మను అంటాడు. మరొకవైపు అనుపమకి ఏంజిల్ ఫోన్ చేసి కాలేజీకి వస్తున్నానని చెప్తుంది. ఆ తర్వాత మనును అనుపమ దూరంగా ఉండి చూస్తుంటుంది. అప్పుడే మహేంద్ర వచ్చి మనుతో మాట్లాడాలి రమ్మని అనుపమని పిలుస్తాడు. నాకు వర్క్ ఉందదని అనుపమ అనగానే.. మను దగ్గరికి కి వెళ్లి నువ్వు ఎప్పుడు వసుధారకి రిషి విషయంలో గానీ కాలేజీ విషయం లో గానీ హెల్ప్ గా ఉండాలని అనగానే సరేనని మను అంటాడు. ఆ తర్వాత బోర్డు మీటింగ్ లో మిషన్ ఎడ్యుకేషన్ గురించి వసుధార మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |